
భారత్కు 114 రఫేల్ యుద్ధవిమానాలు
భారత వాయుసేనను బలోపేతం చేసేందుకు 114 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ విమానాల్లో అధిక భాగాన్ని భారత్లోనే తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫిబ్రవరి 2026లో రఫేల్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ‘అక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ ఆమోదం తెలిపింది. రఫేల్ విమానాల్లో భారతీయ ఆయుధాలు, వ్యవస్థల అనుసంధానంతో పాటు స్వదేశీ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరోవైపు తేజస్ ఎంకే2, ఏఎంసీఏ అభివృద్ధి కార్యక్రమాలపైనా భారత్ దృష్టి కొనసాగిస్తోంది.




