గుజరాత్‌లోని వల్సాద్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. పైఅంతస్తులో లిఫ్ట్ ఎక్కిన వ్యక్తి, గ్రౌండ్ ఫ్లోర్‌లో డోర్ తెరుచుకోగానే దిగేందుకు ప్రయత్నించాడు. అయితే, డోర్లు మూసుకునేలోపే లిఫ్ట్ వేగంగా పైకి వెళ్లడంతో ఆ వ్యక్తి బయటకు జారి కిందపడ్డాడు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. లిఫ్ట్ సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.