
SSMB29.. నేడు పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్ విడుదల
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దర్శకుడు రాజమౌళి తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మళయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా రాజమౌళి తెలిపారు.




