మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఒక వ్యక్తి కుప్పకూలి మరణించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోర్‌లోని దావా బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ధర్మేంద్ర కుమాయు (32) అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.