తరచూ బాత్‍రూమ్‌కు ఉద్యోగి.. షాకిచ్చిన కంపెనీ

49చూసినవారు
తరచూ బాత్‍రూమ్‌కు ఉద్యోగి.. షాకిచ్చిన కంపెనీ
చైనాలో ఒక సంస్థ తరచూ బాత్‌రూమ్‌కు వెళ్తున్న లీ అనే ఉద్యోగిని తొలగించింది. గతేడాది ఏప్రిల్-మే మధ్య 14 సార్లు బాత్‌రూమ్ బ్రేక్ తీసుకుని, ఒక్కోసారి అరగంట, మరోసారి నాలుగు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు సీసీటీవీలో తేలింది. కంపెనీ నిబంధనల ఉల్లంఘన కింద తొలగింపుపై లీ కోర్టును ఆశ్రయించి రూ.41 లక్షలు డిమాండ్ చేశాడు. అనారోగ్యం కారణంగానే అలా వెళ్లాల్సి వచ్చిందని వాదించినా, న్యాయస్థానం అతని వాదనను తోసిపుచ్చి, సంస్థకు చేసిన సేవలను, నిరుద్యోగం తర్వాత అతని ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రూ.4 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్