ఉద్యోగిని పథకం.. రూ.3 లక్షల వరకు రుణం

7చూసినవారు
ఉద్యోగిని పథకం.. రూ.3 లక్షల వరకు రుణం
మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, ఆర్థికంగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తోంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం వస్తుంది. 18-55 ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం/ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అప్లై చేయడానికి బ్యాంకులను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్