జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గుదార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారితో పాటు ముగ్గురు సైనికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది.