
రాబోయే రోజుల్లో పన్నులు మరింత తగ్గిస్తాం: ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధానగర్లో ప్రారంభమైన అంతర్జాతీయ ట్రేడ్షోలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. రష్యాతో భారత బంధం కాలపరీక్షల్లోనూ బలపడిందని అన్నారు. భారత్లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో 55% యూపీ నుంచే వస్తున్నాయని, సెమీకండక్టర్ రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వృద్ధికి రెక్కలు వస్తాయని, పన్ను తగ్గింపులు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని మోదీ స్పష్టం చేశారు.




