
ఇంజెక్షన్ల కలకలం.. వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి (వీడియో)
TG: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఉప్పుగూడలో ఇంజెక్షన్ల కలకలం రేపింది. ఓ వ్యక్తి రాజరాజేశ్వరీ బార్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి వద్ద మాత్రలు, ఇంజెక్షన్, లిక్కర్ బాటిల్స్ లభించాయి. మృతుడు సాయినాథ్ (38)గా గుర్తించారు. అయితే అతడికి ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




