ఇంధన సామర్థ్య స్టార్‌ లేబులింగ్‌ తప్పనిసరి: కేంద్రం

82చూసినవారు
ఇంధన సామర్థ్య స్టార్‌ లేబులింగ్‌ తప్పనిసరి: కేంద్రం
జనవరి 1 నుంచి రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, ఎల్‌పీజీ గ్యాస్‌ స్టవ్‌లు, కూలింగ్‌ టవర్లు, చిల్లర్స్‌తో పాటు డీప్‌ ఫ్రీజర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ ఇన్వెర్టర్లకు ఇంధన సామర్థ్యం తెలిపే స్టార్‌ లేబులింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో కొన్ని ఉత్పత్తులకు ఇది స్వచ్ఛందంగా ఉండేది. ఈ జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్