ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రేపు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, నిన్న రాత్రి మద్దులపల్లి స్టేజి వద్ద రోడ్డు దాటుతున్న ప్రసాద్(28)ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.