మహారాష్ట్రలోని పుణేలో దారుణ ఘటన జరిగింది. రోడ్డు వేస్తుండగా ఓ అసిస్టెంట్ ఇంజినీర్ రోడ్డు రోలర్ వెనకాలే ఉంటూ డ్రైవర్‌కు సూచనలు ఇచ్చాడు. ఆ వెహికల్ ఒక్కసారిగా వెనక్కి రావడంతో దాని కింద పడిపోయాడు. పైనుంచి రోలర్ వెళ్లడంతో అతను స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.