
గాజాలో 67 వేలమంది మృతి.. లక్ష భవనాలు ధ్వంసం
గాజా యుద్ధం ప్రారంభమై నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలతో ప్రారంభమైన ఈ పోరులో గాజా భూభాగం శిధిలమైంది. ఇప్పటివరకు 67 వేలమంది పాలస్తీనీయులు మృతి చెందగా, 1.7 లక్షలమంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రతి 10 మందిలో ఒకరు మరణించగా, 9 మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం లేక చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని WHO తెలిపింది.




