టీ20 ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో ఇంగ్లాండ్.. రెండో స్థానానికి భారత్

6613చూసినవారు
టీ20 ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో ఇంగ్లాండ్.. రెండో స్థానానికి భారత్
మాంచెస్టర్‌ వేదికగా శనివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీంతో టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్ భారత్‌ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది. అఫ్గానిస్థాన్‌పై 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ సాధించినా భారత్ నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. గత 2 నెలల్లో ఈ రెండు జట్ల మధ్య నంబర్‌వన్ స్థానం 3 సార్లు మారింది.

సంబంధిత పోస్ట్