ఉప్పల్‌ స్టేడియంలో అలరిస్తున్న లేజర్‌ షో (వీడియో)

9చూసినవారు
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, ఫలక్ నుమా ప్యాలస్‌కు వెళ్లారు. త్వరలోనే ఉప్పల్ స్టేడియానికి కూడా రానున్న మెస్సీ కోసం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులను అలరించడానికి అద్భుతమైన లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఈ లేజర్ షోలో సీఎం రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీల ఫోటోలను ప్రదర్శించారు. ఈ దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్