పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిర్బంధం రద్దు

33చూసినవారు
పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిర్బంధం రద్దు
లద్దాఖ్‌కు చెందిన పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిర్బంధాన్ని కేంద్రం రద్దు చేసింది. దీంతో ఆరు నెలల తర్వాత వాంగ్‌చుక్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గతేడాది సెప్టెంబర్‌లో లేహ్‌ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లకు కారకుడిగా వాంగ్‌చుక్‌ను భావిస్తూ కేంద్రం ఆయనపై నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ పెట్టింది. దీంతో అప్పటి నుంచి జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్