ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) పీఎఫ్ అడ్వాన్స్ నిబంధనలను సరళీకృతం చేసింది. గతంలో ఉన్న 13 రకాల సంక్లిష్ట పద్ధతులను రద్దు చేసి, వాటిని 3 కేటగిరీలుగా మార్చింది. దీని ప్రకారం, 12 నెలల సర్వీస్ ఉన్న చందాదారులు తమ పీఎఫ్ ఖాతా నుండి 75% వరకు డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలకు ఎన్నిసార్లయినా, చదువుకు 10 సార్లు, పెళ్లికి 5 సార్లు, సొంతింటి నిర్మాణానికి 5 సార్లు అడ్వాన్స్ పొందే వెసులుబాటు కల్పించారు. ఉద్యోగం కోల్పోవడం, విపత్తులు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఏటా 2 సార్లు విత్డ్రా చేయవచ్చు, అయితే పీఎఫ్ ఖాతాలో కనీసం 25% బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి.