హీరోయిన్ రాశీఖన్నా సినిమా సెట్స్‌లో లింగ వివక్షపై గళమెత్తింది. నటీనటుల మార్కెట్ విలువ ఎలా ఉన్నా, సెట్స్‌లో అందరికీ సమాన గౌరవం దక్కాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కెట్ అనేది జెండర్‌పై కాకుండా ట్యాలెంట్‌పై ఆధారపడాలని, మహిళా నటీనటులకు తగిన గౌరవం, సదుపాయాలు లభించాలని ఆమె పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.