
అంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన గణేష్ (30), మునిరాజు (58) చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందారు. గణేష్‌కు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో నీటిలో పడిపోగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన మునిరాజు కూడా మునిగిపోయాడు. ఇద్దరూ చాలాసేపు బయటకు రాకపోవడంతో స్థానికులు గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




