ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


బాహుబలిని ఆస్వాదించలేకపోయా: అనుష్క
Oct 01, 2025, 05:10 IST/

బాహుబలిని ఆస్వాదించలేకపోయా: అనుష్క

Oct 01, 2025, 05:10 IST
తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన 'బాహుబలి' చిత్రం, 'బాహుబలి ది ఎపిక్' పేరుతో అక్టోబరు 31న ఒకే భాగంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేవసేనగా నటించిన అనుష్క మాట్లాడుతూ.. విడుదల సమయంలో ప్రమోషన్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల సినిమాలను పూర్తిగా ఆస్వాదించలేకపోయానని, ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ఒకే భాగంగా రావడం సంతోషంగా ఉందని, ఈసారి అనుభూతిని ఆస్వాదించాలనుకుంటున్నానని తెలిపారు. నిర్మాత శోభు 'బాహుబలి ది ఎపిక్' గురించి చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించిందని, తెరవెనుక భారీ వర్క్ జరుగుతోందని, ప్రేక్షకులకు కొత్త సినిమా అనుభూతిని మళ్లీ అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.