
ఆర్డీ పరేడ్‌లో సీఆర్పీఎఫ్ బృందానికి కమాండెంట్‌గా మహిళా ఆఫీసర్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే ఆర్డీ పరేడ్‌లో పాల్గొనే CRPF మార్చింగ్ బృందానికి సిమ్రన్ బాలా కమాండర్‌గా వ్యవహరించనున్నారు. 26 ఏళ్ల ఈ మహిళా ఆఫీసర్, 140 మంది పురుషులతో కూడిన CRPF బృందానికి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న సిమ్రన్ బాలా, పారామిలిటరీ దళంలో ఆఫీసర్ ర్యాంక్‌లో చేరిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె యూపీఎస్సీ CAPF అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.




