
అమ్మో.. దీపావళికి బంగారం రేటు మరింత పెరుగుతుందట!
బంగారం ధరలు శుక్రవారం ప్రాఫిట్-బుకింగ్ కారణంగా స్వల్పంగా తగ్గినప్పటికీ, దీపావళి నాటికి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.11,868/గ్రామ్, 22 క్యారెట్ల బంగారం ధర రూ.10,879/గ్రామ్ ఉంది. వెండి ధర కూడా చరిత్రలో ఎన్నడూ లేనంతగా కిలో రూ.1,64,100 దాటింది. ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా మారింది. ముందే కొనుక్కోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.




