1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయంపై జెండా ఎగురుతూనే ఉంది: ప్రధాని మోదీ

35చూసినవారు
1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయంపై జెండా ఎగురుతూనే ఉంది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. గత ప్రభుత్వాలు సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించాయని విమర్శించారు. తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ధ్వజమెత్తారు. ఈ ఆలయం ధైర్యం, త్యాగాలు, దృఢసంకల్పానికి నిదర్శనమని, 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూ భారత దేశ స్ఫూర్తిని చాటుతోందని ప్రధాని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్