TG: తాను పార్టీకి దూరంగా ఉంటున్నానన్నది అవాస్తవమని మునుగోడు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. 'పార్టీలో కొన్ని అంశాలను తప్పుపడుతున్నా.. పార్టీని కాదు. రాహుల్ గాంధీతో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయలు చర్చించా. మానవత్వం ఉన్న గొప్ప నాయకుడు రాహుల్. రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం' అని క్లారిటీ ఇచ్చారు.