TG: తమ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తుందని, అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా పడతామని మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌కు సమీపంలోనే ఉన్నామని, అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో పేదల వద్దకు వస్తామని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు భయపెడితే, తాము వచ్చి వారి సంగతి తేలుస్తామన్నారు. ఢిల్లీకి పంపడానికి డబ్బులున్న ఈ ప్రభుత్వం పేదలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవని విమర్శించారు.