‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను మామూలుగా ఏడవను. కానీ, ఈ సినిమాను శివ ఎడిటింగ్ రూమ్లో చూపించినప్పుడు షాక్ అయిపోయా. రాజ్ కుమార్ హిరాణీ సినిమాల తర్వాత మళ్లీ తనను అంతలా కదిలించిన కథ ఇది. నాది స్టోన్ హార్ట్ అయినా కన్నీళ్లు వచ్చాయి. శివ నిర్వాణ చెప్పిన త్రినాథ్ పాత్ర, 'ఇరుముడి' టైటిల్ వినగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది’ అని రవితేజ అన్నారు.