
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన
పాకిస్తాన్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనల వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. బీపీ, కొలెస్ట్రాల్, కంటిచూపు పరీక్షలు చేసింది. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 27న పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.




