
భారత్ వైపు 15 యూరియా, డీఏపీ నౌకలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 15 నుంచి 20 ఎరువులు, డీఏపీ నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారత్ వైపు వస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో 8 నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియా, 4 నౌకల్లో 2.57 లక్షల టన్నుల డీఏపీ, 3 నౌకల్లో 1.11 లక్షల టన్నుల సల్ఫర్‌ను భారత పోర్టుకు తీసుకొస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.




