TG: మహిళలను మోసం చేసి డబ్బు, ఆభరణాలు కాజేసిన 'నిత్య పెళ్లి కొడుకు' సురేంద్రను భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. 2021లో క్రిస్టియన్ మాట్రిమోని ద్వారా ఒక యువతిని నమ్మించి రూ.15 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నాడు. ఇలా అనేక మంది మహిళలను మోసం చేసిన సురేంద్రపై ఫిర్యాదులు అందడంతో ఏపీలోని కడపలో అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.