భారత్‌పై విండీస్ ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన ప్రతీసారి ఓటమే!

56చూసినవారు
భారత్‌పై విండీస్ ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన ప్రతీసారి ఓటమే!
భారత్‌లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతి సారి టీమ్ ఇండియానే పైచేయి సాధించింది. ఇప్పటివరకు నాలుగు టీ20ల్లో విండీస్ ముందుగా బ్యాటింగ్ చేసి నాలుగుసార్లూ ఓటమి పాలైంది. 2018లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అదే ఏడాది చెన్నైలో జరిగిన పోరులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2019లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా విండీస్ ఆరు వికెట్ల తేడాతో ఓడింది. ఇక 2022లో కోల్‌కతాలో జరిగిన టీ20లో భారత్ మరోసారి ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్