నల్గొండలో జరిగిన
కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఓటరును కాపాడుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.