తెలంగాణ టెట్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జనవరి 3 నుంచి జనవరి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 97 కేంద్రాలలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పేపర్-1 కు 85,538 మంది, పేపర్-2 కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు, అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు.