దూరదర్శన్ లోగోలోని రంగు మార్పుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తాజాగా ప్రసార భారతి మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు దూరదర్శన్ ఛానల్ లోగోను కాషాయంగా మార్చేసిందని.. ఇది చూసి తాను మనస్థాపానికి గురయ్యానన్నారు. లోగోను చూస్తుంటే ప్రసార భారతి కాదు.. ప్రచార భారతిని తలపిస్తోందన్నారు. కాగా జవహర్ సర్కార్ 2012 నుంచి 2016 వరకు ప్రసార భారతి సీఈవోగా పని చేశారు.