రాజస్థాన్ లో కోటాలో తన 22ఏళ్ల కోడలిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని రిటైర్డ్ సైనికుడు, బీజేపీ నేతపై ఆరోపణలు వచ్చాయి. తన భర్త జైపూర్లో ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, తన మామ చాలా రోజులుగా తనను చెడు దృష్టితో చూసేవాడని, తాను స్నానం చేసే సమయంలోనూ చూస్తూ ఉండేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబం నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.