మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బుధవారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్లు చేరుకున్నారు. ప్రెసిడెంట్ శేఖర్ రావు, సెక్రటరీ శ్రీధర్, అనుపమ్ రెడ్డి, బాలగోవింద్ రాజు, భరత్ నారంగ్ తదితరులు చిరంజీవితో భేటీ అయ్యారు. సోమవారం చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు, మరోసారి ఆయన నుంచి పిలుపు అందుకున్నారు. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై ఈ రోజు జరిగే సమావేశంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం
చిరంజీవి జోక్యంతో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.