
జీవామృతాన్ని ఎలా తయారు చేయాలో తెలుసా?
జీవామృతం తయారు చేయాలంటే ముందుగా 200 లీటర్ల నీటిని డ్రమ్ములో తీసుకుని, దానిలో 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీల ఆవు పేడ, 2 కేజీల పప్పు పిండి, 2 కేజీల బెల్లం, గట్టుమట్టి గుప్పెడు కలపాలి. కర్రతో బాగా కలిపి, నాలుగు రోజులు మురగనివ్వాలి. ఈ సమయంలో రోజుకు మూడుసార్లు కలపాలి. నాలుగు రోజుల తర్వాత తయారైన జీవామృతాన్ని పంటలకు వాడుకోవచ్చు. ఇది పంటలకు బలం అందించి, నేల సారాన్ని పెంచుతుంది. ఒక ఎకరానికి సరిపోతుంది.




