
విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు.. రెండో రోజు కీలక సమావేశాలు
AP: విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కీలక సమావేశాలతో కొనసాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. గూగుల్, శ్రీసిటీ, రేమండ్, ఇండోసోల్ ప్రాజెక్టుల శంకుస్థాపన ఇవాళ (శనివారం) జరుగుతుంది. బహ్రెయిన్, న్యూజిల్యాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఆంధ్రా టూరిజం విజన్ సెషన్ల్లోనూ పాల్గొననున్నారు.




