
నూతన సీడీఎస్‌గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరణ
భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మిలిటరీ థియేటరైజేషన్ బాధ్యతలను ఇక నుంచి సుబ్రమణి పర్యవేక్షించనున్నారు. చైనా, పాకిస్థాన్ అంశాల్లో నైపుణ్యం కలిగిన జనరల్ రాజా సుబ్రమణి, ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్స్ ఏర్పాటుతో థియేటరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి సైనిక దళాలు కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు.




