
ఇరాన్లో భూకంపం: అణు కేంద్రాలపై అనుమానాలు
ఇరాన్లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్సులో ఖోంజ్ వద్ద భూకంప కేంద్రం ఉన్నది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయి. మరోవైపు, ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటాంజ్‌లోని యురేనియం శుద్దీకరణ ప్లాంట్‌పై అమెరికా దళాలు దాడి చేసినట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడులపై ఇరాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది.




