ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే టెహ్రాన్‌లో మళ్లీ పేలుళ్లు (వీడియో)

13చూసినవారు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మరోసారి పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ఆందోళన నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ పేలుళ్లకు కారణం ఏమిటి?, దాడులు ఎవరు నిర్వహించారు? అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం టెహ్రాన్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్