వివాహేతర సంబంధం.. మహిళపై డీజిల్ పోసి తగలబెట్టిన ప్రియుడు!

41చూసినవారు
వివాహేతర సంబంధం.. మహిళపై డీజిల్ పోసి తగలబెట్టిన ప్రియుడు!
TG: వికారాబాద్(D) కుల్కచర్ల(M)లో అదృశ్యమైన అమృతమ్మ (34) అనే మహిళ హత్యకు గురైంది. చెల్లాపూర్ గ్రామానికి చెందిన అమృతమ్మకు కుల్కచర్లకు చెందిన గంధం భీమయ్యతో వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అమృత కుల్కచర్లకు చెందిన మంగలి ఆనంద్ (28)తో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో అతడికి ఇచ్చిన నగలను తిరిగి ఇవ్వాలని అమృత అడిగింది. దీంతో ఆనంద్ ఆమెను సెప్టెంబర్ 18న కారులో తీసుకెళ్లి, MBNR జిల్లా గండేడ్(M) వెన్నాచెడ్ చెరువు కట్ట వద్ద చీరకొంగుతో మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్