
పూరి - సేతుపతికి చిత్రానికి సంగీతం అందించనున్న 'యానిమల్' సంగీత దర్శకుడు
దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా, టబు హీరోయిన్గా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పూరి సేతుపతి'. ఈ సినిమాకు 'యానిమల్' చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి, జాతీయ అవార్డు అందుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్లను మిళితం చేసే ఒక కొత్త తరం సంగీత అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం తెలిపింది.




