యూపీలోని రాంపూర్‌లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఒక యువకుడు వరుసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టడానికి ప్రయత్నించడంతో, ఆమె అతనిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. దీంతో ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. అక్కడ వారు ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. తాము కలిసి జీవిస్తామని పోలీసుల సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.