AP: నెల్లూరు నగరంలోని గుర్రాలు మడుగులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమకు న్యాయం జరగాలని బాధిత కుటుంబాలు మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించాయి. మృతుల కుటుంబాలకు అండగా సీపీఐ, CPM నేతలు సంఘీభావం తెలిపారు. అక్కడ భారీగా మృతుల కుటుంబాలు, పోలీసుల మొహరింపుతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.