Top 10 viral news 🔥

అనుమానంతో భర్తను కిడ్నాప్ చేసిన భార్య
AP: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. మంజుల అనే మహిళా కానిస్టేబుల్ తన భర్త ప్రవీణ్‌ను కిడ్నాప్ చేసింది. ప్రవీణ్ రైల్వే ఉద్యోగి కాగా, భార్యభర్తలు కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, ప్రవీణ్ వేరే మహిళతో ఉంటున్నాడన్న అనుమానంతో మంజుల 15 మందితో కలిసి భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.




