
జీతం గొడవలో భార్యను హత్య చేసి.. ఖాళీ స్థలంలో పడేసిన భర్త
బెంగళూరులోని ఎంఎస్ నగర్ అగ్రిహార లేఅవుట్‌లో ఓ పాడుబడిన ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా బెడ్‌షీట్‌లో చుట్టి ఉన్న మహిళ కుళ్ళిన మృతదేహం లభించడం కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తులో ఒడిశాకు చెందిన అనసూయ (28)గా గుర్తించి, ఆమె భర్త సాగర్ చంద్ర రావత్ (32)ను అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 11న జీతం విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో సాగర్ ఆమెను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని మూడు రోజుల తర్వాత ఖాళీ స్థలంలో పడేశాడు. దుస్తుల ట్యాగ్ ఆధారంగా పోలీసులు మృతురాలిని గుర్తించి, తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.




