TG: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో నోట్ల మార్పిడి చేస్తుండగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వారిని పట్టుకుని, నిందితుల నుంచి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లపై చిల్డ్రన్ బ్యాంకు పేరుతో ముద్రించినట్టు సమాచారం.