నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్‌ సోదరుల కస్టడీకి అనుమతి

17523చూసినవారు
నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్‌ సోదరుల కస్టడీకి అనుమతి
నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి రమేశ్‌, జోగి రాములను 4 రోజుల పాటు విచారించేందుకు విజయవాడ ఎక్సైజ్‌ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 26 (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్సైజ్‌ అధికారులు వీరిని విచారించనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ నెల్లూరు జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.