
పసికందును వదిలేసిన తల్లిదండ్రులు.. కాపాడిన వీధి కుక్కలు
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని రైల్వేవర్కర్స్ కాలనీలో ఓ బాత్రూమ్ ఎదుట అప్పుడే పుట్టిన పసికందును తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున వదిలేసి వెళ్లిపోయారు. దుప్పటిలో చుట్టి ఉన్న ఆ పసికందు చుట్టూ వీధి కుక్కలు చేరి.. ఉదయం వరకు చిన్నారికి రక్షణగా ఉన్నాయి. కుక్కల మధ్యలో ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారమిచ్చారు.




