
'ఏం తాగినవ్.. మందు తాగిన'.. పోలీసులను ఆటాడుకున్న మందుబాబు (వీడియో)
TG: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్లో ఓ 22 ఏళ్ల యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు పట్టుబడ్డాడు. మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువకుడు, 'ఏం తాగినవ్ అంటే.. మందు తాగిన' అని సమాధానమిచ్చాడు. 'నా డబ్బులతో తాగుతున్నా మీకేంటి?' అని రెచ్చిపోయాడు. ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఫోన్లో చూసుకుని కడతానని, తనకు ఎలాంటి భయం లేదని, తాను నిమ్మలంగానే బైక్ నడుపుతున్నానని పోలీసులకు చెప్పుకొచ్చాడు.




